కొల్లేరు గ్రామాలలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం
1 min read

కోమటి లంక బ్రిడ్జి నిర్మాణ పనులకు అటవీ శాఖతో పాటు,కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించాం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కొల్లేరు గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మా లక్ష్యం – కోమటి లంక బ్రిడ్జి నిర్మాణ పనులకు అవసరమైన నివేదికలను అటవీ శాఖ తో పాటు కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించాం గత వైసిపి హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజాధనాన్ని, ప్రజలదనాన్ని దోచుకున్న అక్రమార్కుల నుంచి ప్రతి ఒక్క రూపాయి రికవరీ చేసి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటాం. అలాంటి వారు ఏ ముసుగులో ఉన్న ముసుగు తొలగిస్తాం, చర్యలు తీసుకుంటాం ప్రజలకు న్యాయం చేస్తాం ఇది ముమ్మాటికి జరిగి తీరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రు, పెదయాగనమిల్లి, కలకుర్రు, మానూరు, మహేశ్వరపురం, కోమటిలంక గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడించారు.సుపరి పాలెం లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు ఏలూరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలనను ప్రజలకు వివరించారు. అదేవిధంగా వారికి ఉన్న సమస్యలను కూడా స్వయంగా తెలుసుకుని సత్వరమే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు.తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి గ్రామ గ్రామాన ప్రజలు ఎంతో అభిమానంతో ఘన స్వాగతాలు పలికారు. భారీ గజమాలతో , పూల జల్లులతో, మహిళల మంగళహారతులతో ఆద్యంతం ఆయన వెంట నడుస్తూ ఉత్సాహభరితంగా కూటమి నాయకులతో పాటు గ్రామస్తులు సైతం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “కొల్లేరులో గ్రామాల అభివృద్ధికి ,ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోమటి లంక గ్రామ బ్రిడ్జి నిర్మాణం చేసే విధంగా అవసరమైన నివేదికలను అటు అటవీ శాఖ తోపాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తగిన నివేదికలు అందించడం జరిగిందని, అదేవిధంగా శ్రీపర్రు గ్రామంలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో భాగంగా తెచ్చిన తూరలను, ప్రభుత్వం మారిన తర్వాత ఆనాటి వైసిపి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు యదేచ్ఛగా తూరలను ఎత్తుకుపోయి ప్రజా ధనాన్ని దోచుకున్నారని అటువంటి అక్రమార్కుల నుంచి ఏలూరు రూరల్ మండలంలోని ప్రజలు కోల్పోయిన ప్రతి ఒక్క ప్రజాధనాన్ని ప్రజల ధనాన్ని కూడా రికవరీ చేసి వాళ్ళందరిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం ముమ్మాటికి జరిగి తీరుతుందని. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.


