NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్పెట్ రంగానికి పూర్వవైభవం

1 min read

ఏలూరు కార్పెట్, బ్యాంకు స్టాల్స్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్ధానిక గోదావరి సమావేశ మందిరంలో బుధవారం బిఐఎస్ నాణ్యతా ప్రమాణాలపై నిర్వహించిన వర్క్ షాప్ లో భాగంగా ఏలూరు కార్పెట్, వివిధ బ్యాంక్ స్టాల్స్ ను ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత స్టాల్స్ ను సందర్శించారు.  ఏలూరు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కార్పెట్ రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లాయంత్రాంగం కృషిచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి కార్పెట్ క్లస్టర్ ఏర్పాటు చేసే పనులను వేగవంతం చేశామన్నారు.  కార్పెట్ క్లస్టర్ కు సంబంధించిన డిపిఆర్ ను వేగవంతంగా పూర్తిచేసి రాష్ట్ర, కేంద్రస్ధాయి కమిటీలకు సమర్పించే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఆయా బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన కలెక్టర్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఎంఎస్ఎంఇ , ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, ఏర్పాటుకు బ్యాంకర్లు ఏవిధమైన రుణాలు అందిస్తున్నదీ తదితర వివరాలను అడిగితెలుసుకున్నారు.  వీరి వెంట ఎల్ డిఎం డి. నీలాధ్రి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి పి. సుబ్రహమణ్యేశ్వరరావు, ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాసరావు, ఎఫ్ ఎస్ యం ఇ కన్వీనర్ యం.వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

About Author