పాఠశాల సమస్యలను..తక్షణమే పరిష్కరించండి
1 min read

సీపీఎం మండల కార్యదర్శి నాగన్న డిమాండ్..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బి నాగన్న డిమాండ్ చేశారు.బుధవారంజిల్లా పరిషత్ పాఠశాలను సిపిఎం నాయకులువెళ్లిమధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు పెడుతున్న భోజనం మరియు పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను టీచర్లను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ స్కూల్లో భోజనం వండుతున్న కార్మికులకు జీతాలు మరియు విద్యార్థులకు ఇచ్చే మెనూ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలలో దాదాపుగా 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి తగినన్ని గదులు లేవని దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతేకాకుండా హిందీ ఉర్దూ టీచర్ల కొరత ఉందని కాంపౌండ్ వాల్ సక్రమంగా లేదని ఇది ప్రమాదకరంగా ఉందని కనుక తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి అదనపు గదుల నిర్మాణం హిందీ ఉర్దూ టీచర్ల నియామకం మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు జీతాలు అలవెన్స్ లు కాంపౌండ్ వాల్ నిర్మాణం సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్,మహేష్ మాసుం భాష,శేషన్న పాల్గొన్నారు.

