కూటమి హామీలపై ప్రజలు ప్రశ్నించాలి
1 min read

మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప,17వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి, వార్డు ఇంచార్జ్ రామాంజిని రెడ్డి, 18వ వార్డు ఇంచార్జ్ బోయి సోమేశ్.
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ “బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ” కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని 17వ, 18వ వార్డుల్లో ఘనంగా నిర్వహించబడింది. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక ఆదేశాల మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప అధ్యక్షతన 17వ వార్డు కౌన్సిలర్ సంధ్యారాణి, వార్డు ఇంచార్జ్ రామాంజిని రెడ్డి, 18వ వార్డు ఇంచార్జ్ బోయ సోమేశ్ ల ఆధ్వర్యంలో చేశారు.అధికారానికి ఆశపడి చంద్రబాబు నాయుడు ప్రజలకు వందల హామీలు ఇచ్చి అవి అమలు చేయకుండా మోసం చేసిన పూర్వాపరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మోసం చేయడం చంద్రబాబుకు జన్మహక్కులా మారిందని, ఆయనను “మోసానికి బ్రాండ్ అంబాసిడర్” అనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదని విమర్శించారు.నాయకులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేసి, వాటి అమలులో ఎదురైన మోసాన్ని ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటి వద్ద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి, కుటుంబాలకు తలపెట్టిన నష్టాన్ని వివరించారు. పింఛన్లు, రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందకపోవడమే కాకుండా, కొత్త పింఛన్లు ఇవ్వకపోవడాన్ని నేతలు తీవ్రంగా ఆక్షేపించారు.రెడ్‌బుక్ పేరిట వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులు పెట్టడం మాత్రం గట్టిగానే కొనసాగుతుందన్నారు. ఏడాదిలోనే రూ.1.81 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలులో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అభ్యుదయ మార్గాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.చివరగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమిని నిలదీయాలని ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ డి.నజీర్ అహమ్మద్,జిల్లా చేనేత అధ్యక్షులు యం.కె.శివ,జిల్లా అధికార ప్రతినిధి కదిరికోట సునీల్ కుమార్,జిల్లా అంగన్వాడి విభాగ కార్యదర్శి సావిత్రమ్మ,నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు విశ్వనాథ్ రమేష్,పట్టణ బిసి సెల్ అధ్యక్షులు బోయ బజారి,పట్టణ మహిళ అధ్యక్షురాలు లతారెడ్డి,పట్టణ యూత్ అధ్యక్షులు బోయ రాజు,కో ఆప్షన్ మెంబర్ అబ్రార్, పట్టణ ఉపాధ్యక్షులు కోటకొండ నరసింహులు,పట్టణ ప్రధాన కార్యదర్శులు గడ్డం అంజి,యు.యు నాగేష్,కరే రాము, పట్టణ కార్యదర్షి గుర్వ మాభాష,జెరుబండి రఘువీర, కార్యవర్గ సభ్యులు అల్తాఫ్,2వ వార్డు ఇంచార్జ్ చంద్ర,15వ వార్డు ఇంచార్జ్ సయ్యద్ ఫయాజ్,25వ వార్డు ఇంచార్జ్ జి. శ్రీనివాస్ రెడ్డి,31వ వార్డు ఇంచార్జ్ పాల శ్రీనివాస్ రెడ్డి, 33వ వార్డు ఇంచార్జ్ వడ్డే వీరేష్,నాయకులు మోనే హర్ష,సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ భాష,నియోజకవర్గ అధ్యక్షులు షరీఫ్, జిల్లా కార్యదర్శి కదిరికోట రాజ్ కుమార్, సభ్యులు జశ్వంత్, 17,18 వార్డు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

