హజ్ యాత్రకు పొడిగించిన గడువును యాత్రికులు సద్వినియోగం చేసుకోండి..
1 min read
రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్
ఆగస్టు 7వ తేదీ వరకు హజ్ యాత్రకు దరఖాస్తు గడువు పెంపు
కర్నూలు , న్యూస్ నేడు: ఆగస్టు 7వ తేదీ వరకు హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ ను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికులకు కూటమి ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తుందని గుర్తు చేశారు. ముస్లిం, మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు.
మైనారిటీలు, కృషి, యాత్రికులు,

