జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఎన్నిక
1 min read

ముఖ్యఅతిథిగా పాల్గొన్న
ఏపీ ఎన్జీవో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్
జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రంథాలయ సంస్థ సిబ్బంది
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులసంఘం ఎన్నిక జిల్లాకేంద్రగ్రంధాలయం ఏలూరులో ఘనంగాజరిగింది.ఎన్నికలలో జి.రాంబాబు అధ్యక్షులుగా అసోసియోట్ అధ్యక్షులుగా పి.రంగారావు ఉపాధ్యక్షులు గా ఏస్. వెంకటేశ్వరరావు, ఎస్ డి.లతీఫ్,ప్రధాన కార్యదర్శిగా ఎండి జూల్ఫిఖర్ అలి, సహాయ కార్యదర్శిగా, కొండే.వెంకటేశులు,జిల్లా కోశాధికారి గా ఎన్ సి హెచ్ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎమ్.శోభ , జిఅనిత,బంగారుపాప, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిదులుగా ఉమ్మడిపశ్చిమ గోదావరిజిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి ఎమ్.శేఖర్ బాబు,అర్ఎస్.హరనాథ్ ఏపీ జెఎసి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఏపీ ఎన్ జి జి ఓ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు, ఏపీ ఎన్ జి జి ఓ ఏలూరు తాలూకా అధ్యక్షులు జి.శ్రీధర్ రాజు, ఏపీఎస్ జెడ్ జిఎస్ఇ ఏ రాష్ట్ర అసోసియోట్ అధ్యక్షులు ఎన్నికల పరిశీలకులుగా కె.కృపానందం ఎన్నికల అధికారిగా హాజరుఅయ్యారు.ఈ కార్యక్రమంనకుహాజరు.ఎన్ జి జి ఓ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు010ఖాతా ద్వారా జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులకు జీతాలు చెల్లింపు చేయించుటకొరకు ఏపీ జెఎసి ద్వారా కృషి చేస్తామని చెప్పారు.అనంతరం ఎన్నికకాబడినకార్యవర్గం సభ్యుల అందరిచేత ఎన్ జి జి ఓ జిల్లాఅధ్యక్షులు చోడగిరిశ్రీనివాస్ ప్రమాణంచేయించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ఎ. నారాయణరావు,సీనియర్ అసిస్టెంట్ ఎల్.వెంకటేశ్వరరావు, కార్యాలయం సిబ్బంది,జిల్లాకేంద్రగ్రంథాలయ సిబ్బంది,జిల్లావ్యాప్తంగా పనిచెస్తున్న సిబ్బంది అధిక సంఖ్యలోపాల్గొన్నారు.

