79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించండి
1 min read
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ఈనెల 15వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో 79,వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 79,వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటినుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలన్నారు.వ్యవసాయం, డిఆర్డిఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా, వ్యవసాయ అనుబంధ రంగాలు, సంక్షేమం తదితర అన్ని సంక్షేమ శాఖలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శనలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. అలాగే ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులకు అప్పగించిన విధులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా అభివృద్ధిపై సందేశ బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వేర్వేరుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓను సూచించారు. ఆహ్వాన పత్రికలను ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి రెండు రోజులు ముందుగానే పంపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల జారీకి జాబితాను సిద్ధం చేయాలని డిఆర్ఓ ను ఆదేశించారు.పార్కింగ్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ, వివిధ శాఖల జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

