సమాజంలో గౌరవమైన, ప్రగతికి ప్రభావంతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి
1 min read
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
అప్పన్న వీడు జిల్లా పరిషత్ ఉపాధ్యాయురాలు మాగంటి అమరావతి కి వీడ్కోల సభ
పెద్దఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులు,స్కూల్ సిబ్బంది,బంధుమిత్రులు శ్రేయోభిలాషులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్రంలో విద్యకు అత్యుత్తమ ప్రాధాన్యతను ఇవ్వడం, అదేవిధంగా ఉపాధ్యాయులకు సగర్వంగా తలెత్తుకుని జీవించేలా గౌరవాన్ని అందించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని, గత వైసీపీ ప్రభుత్వంలో చదువు చెప్పే ఉపాధ్యాయులను సైతం, బాత్రూములు వద్ద కాపలా పెట్టించి అవమానించినటువంటి ఘటనలు విద్యావ్యవస్థకు సిగ్గుచేటని, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బంగారు మయంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.సమాజంలో ఎంతో గౌరవనీయమైన, ప్రభావవంతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలంగా కొనసాగి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ సిబ్బందికి, అదేవిధంగా వారికి సహకరిస్తున్న బోధనేతర సిబ్బంది సేవలు ఎంతో అభినందనీయమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పెదపాడు మండలం అప్పన్నవీడు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన మాగంటి అమరావతి(సైన్స్ టీచర్) గా పదవీ విరమణ అభినందన సభలో పాల్గొని దంపతులను పూల బొకేలు అందించి శాలువా కప్పి ఘనంగా ఎమ్మెల్యే సత్కరించారు.పదవీ విరమణ అనంతరం మాస్టర్ భార్యాభర్తల జీవితం ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా కొనసాగాలని అదేవిధంగా వారికి ఉన్నటువంటి అపూర్వమైనటువంటి సైన్సు సబ్జెక్టు పట్ల కలిగిన జ్ఞానాన్ని అవకాశం ఉన్న మేరకు సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు సహకరిస్తూ ఉండేలా కూడా ఉండాలని ఆశిస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, స్కూల్స్ అసిస్టెంట్ సిబ్బంది, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వీడ్కోల సభలో పాల్గొన్నారు.

