రైతుల ప్రభుత్వమే..కూటమి ప్రభుత్వం
1 min read

25 కోట్ల 14 లక్షల రూ.లు జమఅన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రైతులను ఆదుకునే ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వమేననినందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గానికి”అన్నదాత సుఖీభవ పథకం”కింద 36,734 మంది రైతులకు గాను 25 కోట్ల 14 లక్షల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ అవుతాయని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం కలిపి సంవత్సరానికి మూడు విడతలుగా మొత్తం 20 వేల రూ.లు రైతుల అకౌంట్లో వేయడం జరుగుతుందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా జరుగుతుందో అందరూ చూస్తూ ఉన్నారని ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తల్లుల అకౌంట్లో తల్లికి వందనం వేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి రూ.2,342.92 కోట్లు రైతుల ఖాతాలో నేరుగా జమ చేసి, లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ చెక్కులు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర సురేంద్ర రెడ్డి యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్,ఆర్డీవో నాగజ్యోతి,ఏడిఏ గిరీష్,ఏవో షేక్షావలి,సొసైటీ చైర్మన్ ముర్తు జావలి,కౌన్సిలర్లు భాస్కర్ రెడ్డి, జాకీర్ హుస్సేన్ మరియు వివిధ గ్రామాల నాయకులు రైతులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

