భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
1 min read
శ్రీ సన్నిధి ట్రావెల్స్ ను ప్రారంభించిన వైకాపా నేత వై. ప్రదీప్ రెడ్డి
మంత్రాలయం, న్యూస్ నేడు: మంత్రాలయం కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకే టికెట్లు బుక్ చేసి మెరుగైన సేవలు అందించాలని వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మంత్రాలయం లో శ్రీ సన్నిధి ప్రైవేటు ట్రావెల్ బస్సు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రాలయం నుండి మంగళూరు వయా ఉడిపి, మనిపాల్, కుందాపూర్, శివమెగ్గ, బళ్లారి మీదుగా వెళ్లేందుకు శ్రీ సన్నిధి ట్రావెల్స్ యాజమాన్యం మంగళూరు కు చెందిన సతీష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్లీపర్ బస్సు సర్వీసు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మంత్రాలయం కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం బస్సు లోపలి భాగంను పరిశీలించి జెండా ఊపి బస్సు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వైఎస్సార్సీపీ నాయకులు బూదూరు లక్ష్మి నారాయణ రెడ్డి, బొజ్జప్ప, రాము, మారెప్ప తదితరులు ఉన్నారు.

