NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిపాలకు ప్రాధాన్యత ఇవ్వండి…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: తల్లి పాలు ఇవ్వడానికి  వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వండి”……. తల్లిపాలకు ప్రాధాన్యత ఇవ్వండి – తల్లిపాలు ఇవ్వడానికి కావలసిన వసతులు కల్పించడం” అన్నది  2025  సం..ప్రాధాన్యత గా తీసుకొని ప్రచారం చేయాలని కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ & కమ్యూనిటీ మెడిషన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డా. సింధియా శుభప్రద ఆరోగ్య సిబ్బందికి పిలుపు నిచ్చారు. సోమవారం కర్నూలు మండలంలోని ఉల్చాల గ్రామంలో ఆరోగ్య సిబ్బంది, మెడికల్ కాలేజి కమ్యూనిటీ  మెడిసిన్ డిపార్ట్మెంట్, ఎల్.వి. టి. జి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లు సంయుక్తంగా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత, పాలివ్వడానికి కావలసిన వసతుల ఏర్పాటు గురించి మరియు  ఏ విధంగా ఇవ్వాలి, ఇవ్వకూడదు అన్ని అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డ ఆరోగ్యంతో పాటు  తల్లికి కూడా క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుందని అన్నారు. తాండ్రపాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుషా మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది అందరూ తమ తమ ప్రాంతాల్లో తల్లిపాలు వారోత్సవాల్ని ఘనంగా నిర్వహించాలని ప్రాముఖ్యత గురించి వివరించాలని తెలిపారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలిచ్చేతల్లు లకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బలమైన ఆహార పదార్థాలను ప్రతి తల్లికి చేరే విధంగా పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఎల్. వి. టి.జి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫ్యాకల్టీ ప్రియదర్శిని మాట్లాడుతూ తమ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు గర్భవతులకు పాలిచ్చే తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా వివిధ రూపాల్లో తయారుచేసిన ఆర్టికల్స్ ప్రదర్శిస్తూ సులభంగా అర్థమయ్యే విధంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీ ఇంటర్న్ వైద్యులు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి. వెంకటేశ్వరమ్మ, సర్పంచ్ సాగర్ ఎంపీటీసీ రాములమ్మ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రవీణ,లెక్చరర్ సురేష్, ఎంపీ.హెచ్. ఇ.ఓ మక్బూల్, సూపర్వైజర్ సాయి, అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎమ్ లు ఎమ్ ఎల్.హెచ్.పి.తదితరులు పాల్గొన్నారు.

About Author