NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డోర్ డెలివరీ ద్వారా రేషన్ సరఫరా పై సమీక్ష..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  సునయన ఆడిటోరియంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్  65 సంవత్సరాలు పైబడిన లబ్దిదారులకు డోర్ డెలివరీ ద్వారా రేషన్ సరఫరా చేయడం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్  మాట్లాుడుతూ, కర్నూలు పట్టణంలో జూన్ నెలలో 76%, జూలై నెలలో 82% పంపిణీ పూర్తయినదిగా, మరియు ప్రస్తుత ఆగస్టు నెలలో ఇప్పటివరకు 68% పంపిణీ బరగినదిగా తెలియజేశారు, కర్నూలు నగరంలో 5914 మంది 65 సంవత్సరాలు దాటిన కార్డుదారులున్నారు.గత రెండు నెలలుగా 65 సంవత్సరాలు పైబడిన లబ్దిదారులు రేషన్ తీసుకోకపోవడానికి గల కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన సూచనలు. సలహాలు అందించారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్లు, వార్డు రెవెన్యూ సెక్రటరీలు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వారు ముగ్గురు సమన్వయంతో పని చేసి, గత మూడు నెలలుగా డోర్ డెలివరి పొందలేని 65 సంవత్సరాలు పైబడిన లబ్దిదారులకు ఈ ఆగస్టు నెలలో 100% పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, కర్నూలు తహసీల్దార్ కార్యాలయం నుండి ఉప తహసీల్దార్, కర్నూలు అర్బన్ సహాయ సరఫరా అధికారి మరియు కల్లూరు తహసిల్దార్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

సంయుక్త కలెక్టరే వారి తరపునకర్నూలుడిప్యూటీ డైరెక్టర్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, కర్నూలు వారికీ అన్ని ప్రముఖ దినపత్రికలలో ప్రచురణ నిమిత్తం పంపించడమైనది.

నకలు:శ్రీయుత కమిషనర్, పౌర సరఫరాలు శాఖ. విజయవాడ వారికీ తగు సమాచారం నిమిత్తం సమర్పించడమైనది.

About Author