NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాతన ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించండి

1 min read

డి గౌస్ దేశాయి.. సిపిఎం జిల్లా కార్యదర్శి

పత్తికొండ, న్యూస్​ నేడు:  నిరంతరం వాహన రాకపోకలతో రద్దీగా ఉండే  తుగ్గలి మండలం రాతన గ్రామం నడిబొడ్డులో ఉన్న ప్రధాన రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి డిమాండ్ చేశారు.మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, జిల్లా నాయకులు వీరశేఖర్, సీనియర్ నాయకులు రంగారెడ్డి, నాయకులు సురేంద్ర, రమేష్, మధు తో కూడిన సిపిఎం ప్రతినిధి బృందం రాతన గ్రామ నడిబొడ్డున గుంతగా మారిన రోడ్డును స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి, అక్కడే నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామం మధ్యలో ఉన్న ప్రధానమైన రహదారి అడుగు లోతు గుంతపడ్డ అధికారులు ఎలాంటి చలనం లేకుండా ఉన్నారన్నారు. పత్తికొండ నుండి గుత్తికి వెళ్లే భారీ వాహనాలు  ఈ రోడ్డు వెంట వెళ్తూ ఎప్పుడు కింద పడతాయో అనే భయంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు. వర్షం వస్తే గుంత నుండి ద్విచక్ర వాహనాలు, పాదాచారులు నిత్యం ప్రమాదానికి గురికావాల్సి వస్తుందన్నారు. రోడ్ల నిర్మాణానికి నిధులు వచ్ఛాయి అని చెప్తున్న అధికారులు ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చడంలో ఎందుకు విఫలమవుతున్నారని వారు విమర్శించారు. జిల్లా కలెక్టర్ జోక్ ఇన్ చేసుకుని ఆర్ అండ్ బి మరియు రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలింప చేయించి రహదారిలో ఉన్న గుంతలను పూడిపించాలని వారు డిమాండ్ చేశారు.

About Author