అభివృద్ధి పనులకు కలెక్టర్ఎ…ఎమ్మెల్యే భూమి పూజ..
1 min read

ఒక కోటి 11 లక్షలతో త్రాగునీటి ట్యాంకుల నిర్మాణం
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వ గ్రామంలో మంగళవారం ఉదయం (ఓహెచ్ఎస్ఆర్) త్రాగునీటి ట్యాంక్ ల నిర్మాణానికి కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి టెంకాయలు కొట్టి భూమి పూజ అనంతరం పనులను ప్రారంభించారు.ముందుగా కలెక్టర్,ఎమ్మెల్యే ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు.గ్రామంలోని కొమ్మ చెరువు రస్తాలో జల జీవన్ మిషన్ పథకం కింద ఒక కోటి 11 లక్షలతో 90 వేల లీటర్లు గల ట్యాంక్ మరియు కొత్త బిల్డింగ్ లో 40 వేల కెపాసిటీ గల త్రాగునీటి నూతన ట్యాంకులకు భూమి పూజ చేశారు.బిల్లింగ్ కాలనీలో”సుపరిపాలనలో తొలి అడుగు”అనే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి పథకాల గురించి వివరించారు.తర్వాత హుశేనాపురంలో రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయం వనరుల మరియు ఉత్పత్తుల కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అదేవిధంగా వీటిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో ఓర్వకల్లు మరియు కల్లూరులో రెండు ఈ కేంద్రాలు మంజూరు అయ్యాయని అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ షాప్ నిర్వాహకులు పుల్లయ్యకు ప్రభుత్వం ఒక లక్ష రూపాయలతో షాప్ కొరకు సహాయం చేసిందని ఇక్కడ లభించే రైతులకు సంబంధించిన వాటిని రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు టిటిడి బోర్డు సభ్యులు మల్లెల రాజశేఖర్,ఆర్డీఓ సందీప్ కుమార్,జెడ్పీ సీఈవో నారస రెడ్డి,ఆర్డబ్ల్యూఎస్ డీఈ అమల,ఎంపీడీవో శ్రీనివాసులు,తహసిల్దార్ విద్యాసాగర్,ఏఈ శ్రీనివాసులు,డీపీఎం మాధురి,ఎంఏఓ మధుమతి, ఎస్సై సునీల్ కుమార్,సర్పంచ్ పెద్ద వెంకటేశ్వర్లు,మండల కన్వీనర్ గోవిందరెడ్డి,నాగిరెడ్డి,ఖాజా,మహబూబ్ బాష తదితరులు పాల్గొన్నారు.


