ఓర్వకల్లులో అక్రమ ప్లాట్లపై రెవెన్యూ కొరడా..
1 min read

తహసిల్దార్ బీవీఎన్ విద్య సాగర్..
ఓర్వకల్లు, న్యూస్ నేడు: అనుమతులు లేకుండా అక్రమంగా ఫ్లాట్లు వేసిన వాటిపై ఓర్వకల్లు రెవెన్యూ అధికారులు కొరడా ఘులిపించారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా గతంలో కాటసాని నగర్ లో సర్వే నెంబర్ 532/సీ లో అక్రమంగా ప్లాట్స్ వేసియున్న రాళ్ళు మరియు ప్లాట్ నెంబర్ వేసిన రాళ్ళను మంగళవారం ఓర్వకల్లు తహసిల్దార్ బీవీఎన్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది వాటిని తొలగించినట్లు తహసిల్దార్ తెలిపారు.మూడు ట్రాక్టర్లతో 20 ట్రిప్పుల రాళ్ళను తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగాన రాళ్లను వేసినట్లు ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఫ్లాట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ శంకర్ మాణిక్యం, వీఆర్ఓ హెచ్.స్వామన్న,గ్రామ సర్వేయర్ కీర్తన మరియు వీఆర్ఏలు పాల్గొన్నారు.

