NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఒక ఉద్యమంగా చేపట్టాలని స్ఫూర్తి సేవా సమితి సభ్యులు అన్నారు. శుక్రవారం డోన్ పట్టణానికి చెందిన యువకుడు హుసేన్ పుట్టినరోజు సందర్బంగా హుసేన్ కుటుంబ సభ్యులు స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని మహాత్మ జ్యోతి రావ్ బాపూలే గురుకుల స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హుసేన్ 38 వ పుట్టినరోజు సందర్బంగా 38 మొక్కలు నాటారు. ఈ సందర్బంగా కార్యక్రమంలో  హుసేన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ హుసేన్ పుట్టినరోజు సందర్బంగా పర్యావరణ హితం కోరుతూ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు, స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, వసంత్, ఫిజికల్ డైరెక్టర్ మోహన్ గౌడ్, విద్యార్థి సంఘం నాయకులు తెలుగు విజయ్, రాజశేఖర్, పాతపేట వెంకటేష్, ఖయ్యుమ్, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author