చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్టు
1 min read

16 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం.
కర్నూల్ డిఎస్పి కార్యాలయంలో వివరాలు వెల్లడించిన… కర్నూల్ డిఎస్పీ బాబు ప్రసాద్.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఎస్పీ శ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గ ఆదేశాల మేరకు, కర్నూలు డిఎస్పి శ్రీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూల్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో, ఎస్ ఐ మోహన్ కిషోర్, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఖాద్రి, ఎస్ షాకీర్, కానిస్టేబుల్ లు ఎల్లా శివుడు, సుబ్బరాయుడు, లక్ష్మణ్ నాయక్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి, కర్నూలు నాల్గవ పట్టణం పరిది లో ఆర్‌టిసి బస్ స్టాండ్ నందు జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ ల పై వచ్చిన ఫిర్యాదుల పై నమోదైన కేసులు, దర్యాప్తు ను కొనసాగించగా నేరములకు పాల్పడిన నిందితుడు గా ఉన్న గున్న అంజి, వయసు సుమారు 20 సం లు, రాముల వారి వీధి, సిద్దాపురం గ్రామము, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా వాసి గా గుర్తించి అతన్ని పట్టుకొనడానికి ఆత్మకూరు, సిద్దాపురం, నంద్యాల, తదితర ప్రాంతాల్లో మాటు వేసారు.కర్నూల్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త బస్టాండ్ ఏరియా నందు బ్యాగ్ లిఫ్టింగ్ నేరానికి, పాల్పడినటువంటి ముద్దాయి అయిన గున్న అంజి ని ఈరోజు నంద్యాల టౌన్ నూనె పల్లి నందు అరెస్ట్ చేసారు.అతని వద్ద నుండి పై కేసులకు సంబంధించి సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు ను స్వాధీనపరచుకొని అరెస్ట్ చేయడమైనదని సంబంధిత యజమానులకు బంగారు ఆభరణాలు కోర్ట్ ద్వారా అప్పగించడం జరుగుతుందని కర్నూల్ డిఎస్పీ బాబు ప్రసాద్ కర్నూల్ డీఎస్పీ కార్యాలయoలో వివరాలు తెలిపారు.

