ప్రతిపక్ష నేత రాహుల్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం బదులు ఇవ్వాలి
1 min read

హొళగుంద న్యూస్ నేడు : భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నేత కాబోయే ప్రధాని రాహుల్ ప్రశ్నలకు ఎన్నికల సంఘం బదులు ఇవ్వాలి . కాంగ్రెస్ పార్టీ హొళగుంద మండల అధ్యక్షులు ఎం, అమానుల్లా దేశంలో ముమ్మటికి ఓట్లు చౌర్యం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి సంబంధించిన ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హొళగుందమండల అధ్యక్షులు ఎం, అమానుల్లా ఎన్నికల సంఘానికికోరడమైనది.హోలా గుందలో ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ఎన్నికలపై జరిగిన అక్రమాలపై రాహుల్ గాంధీ గణాంకాలు విడుదల చేసిన తర్వాత అసలు విషయం ప్రజలకు తెలిసిందని దీనిపై ప్రజలు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారని ఆయన తెలిపారు.ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలను డిజిటల్ మిషన్ డబుల్ ఫార్మేట్ లో ప్రజలకు ఎన్నికల సంఘం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు సంబంధించిన వీడియో ఆధార్లను ఎందుకు ధ్వంసం చేశారు. ఆయన ఎన్నికల సంఘానికిప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగిన ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పకుండా వ్యవహరిస్తుందని ఆయనఅన్నారు. ఎన్నికల సంఘం అధికార బిజెపికి ఎందుకు ఏజెంట్గా పనిచేస్తుంది .ఇప్పటికైనా ఎన్నికల సంఘం ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎం అమానుల్లా కోరడమైనది. కర్ణాటక లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 16 ఎంపీలు వస్తాయని సర్వేలు చెప్పినాయి అయితే ఫలితాలు వచ్చిన తర్వాత కేవలం 9 ఎంపీల సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు. కర్ణాటకలో కూడా అడ్డగోలు జరిగిందని విషయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

