చిన్నతనం నుంచి యోగా సాధన చేయండి…
1 min read

జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్
విద్యార్థులు తమ చిన్నతనం నుంచే యోగాను
అభ్యసించాలని తద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని జిల్లా
కర్నూలు, న్యూస్ నేడు: విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో అవుట్డోర్ స్టేడియం నందు జిల్లాస్థాయి యోగ పోటీలను జిల్లా సంఘం అధ్యక్షుడు అవినాష్ శెట్టి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా డిఈఓ శామ్యూల్ పాల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు దినచర్యలో యోగా సాధన భాగం కావాలని,దీని వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అనంతరం టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సెప్టెంబర్ మొదటి వారంలో ద్వారకా తిరుమల లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు.జిల్లావ్యాప్తంగా పోటీలకు 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి మునిస్వామి, ఒలంపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్, జిల్లా యోగ సంఘం సభ్యులకు లోకేష్, ఈశ్వర్ నాయుడు,లలన ప్రియ, విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.

