NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పౌర హక్కుల రక్షణ అమలుపై సమీక్ష…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. కబర్థి   సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి    బి. లీలా వెంకట శేషాద్రి  13-08-2025 బుధవారం నాడు కర్నూలు జిల్లా న్యాయ సేవాసదన్ నందు గవర్నమెంట్ లైన్ డిపార్ట్మెంట్ల లతో  బాల్య వివాహాలు మరియు చిన్న తనం లోనే ప్రెగ్నెన్సీ మరియు ఎస్సి ఎస్టి    మరియు పౌర హక్కుల రక్షణ ను సమర్థవంతంగా అమలు చేయడం పై సమీక్ష కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ గిరిజన హక్కుల రక్షణ మరియు అమలు పథకం 2015 మరియు ఆదివాసీలు మరియు సంచార తెగలకు న్యాయం పొందే అవకాశాన్ని బలోపేతం చేసే పథకం 2025 పై ప్రజలకు  అవగాహన కల్పించడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  అవగాహన సదస్సు లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.    ఈ సమావేశంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లాల డిస్టిక్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు పి. శాంతి కళ, ఆర్.వెంకటరమణ, కర్నూలు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ, కర్నూలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ బి. రాధిక, నంద్యాల గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ. ఉసెనయ్య, నంద్యాల జిల్లా మహిళా పోలీస్ సిఐ  పి. గౌతమి, కర్నూల్  మరియు నంద్యాల రెవిన్యూ  మరియు దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

About Author