ఆర్యూలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జాతీయతపట్ల, జాతీయ చిహ్నాలపట్ల ప్రతిఒక్కరూ గౌరవాదరాలు పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఆయన వర్సిటీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్సిటీలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించి వి.సి. ప్రసంగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయిన తరుణంలో యువత దేశంపట్ల భక్తివిశ్వాసాలను పెంపొందించుకోవాలన్నారు. త్రివర్ణపతాకంలోని మూడు రంగులు త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకలుగా నిలుస్తాయని వివరించారు. త్రివర్ణపతాక స్ఫూర్తిని, స్వాతంత్రోద్యమంలో అమరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ దేశసేవలో యువత పునరంకితం కావాలని ఆచార్య బసవరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె. నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయడు, చీఫ్ వార్డెన్ ఆచార్య ఎన్. నరసింహులు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య పి.వి. సుందరానంద్, డీన్ ఆఫ్ రీసర్చ్ స్టడీస్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు, వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్. పి. శివకిషోర్ తోపాటు వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

