NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వాకిటి శ్రీనివాసులు ప్రధమ  వర్ధంతి       

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు: గత ఏడాది కొందరి దుర్మార్గుల చేతిలో దారుణంగా హత్యకు గురైన టిడిపి నాయకులు వాకిటి శ్రీనివాసులు ప్రథమ వర్ధంతి స్థానిక టిడిపి ప్రాంతీయ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వర్ధంతి సభలో ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్, టిడిపి శ్రేణులు పాల్గొని వాకిటి శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాకిటి శ్రీనివాసులు కేయి శ్యాం కుమార్ కు అత్యంత సన్నిహితుడు వాకిటి శ్రీనివాసులు అత్యగావించడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. హోసూర్ గ్రామంలో సర్పంచ్ గా టిడిపి పార్టీకి ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. వాకిట శ్రీనివాసులు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. హోసూర్ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ గ్రామంలో టిడిపి పార్టీ బలోపేతానికి కృషి చేశాడని అన్నారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక హత్య చేశారని అన్నారు. వాకిటి శ్రీనివాసులు  లేని లోటు టిడిపి, హోసూర్ గ్రామానికి తీరని లోటని అన్నారు. వాకిటి శ్రీనివాసులు ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండదండలుగా ఉంటామని ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ తెలిపారు.

About Author