NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్దిగుండం చెరువును పరిశీలించిన సిద్ధార్థ రెడ్డి..

1 min read

పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయండి..

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు : జలకనూరు మద్ది గుండం చెరువును త్వరిత గతిన పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రభుత్వాన్ని అన్నారు.గత నాలుగు రోజుల క్రితం మద్దిగుండం చెరువుకు గండి పడడంతో గురువారం సాయంత్రం చెరువును సిద్ధార్థ రెడ్డి పరిశీలించారు.అవసరం లేని పనులు కట్ట వెంట ముళ్ళపొదలు తొలగించడం  చేయడం వల్లే రైతులకు ఈ రోజు నష్టం జరిగిందని పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని సిద్ధార్థ రెడ్డి డిమాండ్ చేశారు.పట్ట నష్టం జరిగిన ప్రతి రైతుకూ నష్ట పరిహారం చెల్లించాలని రైతులకు ఇబ్బందులు పెట్టవద్దన్నారు.రైతులు ఏ పంటలు వేసినా వాటికి గిట్టుబాటు ధర లేదు.చెరువు మరమ్మతుల పనులు ఆలస్యం చేస్తే పార్టీ తరఫున నిరసన తెలుపుతామని సిద్ధార్థ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ పర్వత యుగంధర్ రెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి, ఎంపిటిసి హరి సర్వోత్తమ్ రెడ్డి, రామలింగారెడ్డి, నందికొట్కూరు పట్టణ అధ్యక్షులు మన్సూర్,జబ్బార్,చిన్న రామచంద్రా రెడ్డి,రవి,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author