NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అను మంత్రాలయం లో మహా రథోత్సవం

1 min read

తుంగభద్ర  మఠంలో ఉత్సవ మూర్తి మహా రథోత్సవం

మంత్రాలయం, న్యూస్​ నేడు  : మంత్రాలయం మండల పరిధిలోని తుంగభద్ర గ్రామంలో అను మంత్రాలయంగా పేరు గాంచిన (తుంగభద్ర గ్రామం)లోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 354 వ సప్త ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం  పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో, ఉత్సవాల్లో భాగంగా మహా రథోత్సవం వేడుకలు పురస్కరించుకుని  శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్నికి విశేష పూజలు నిర్వహించారు. అంతకు ముందు తుంగభద్ర గ్రామంలోని శ్రీ మఠం చేరుకున్న పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులకు, మఠం మేనేజర్ కుర్డి నాగేష్ ఆచార్ ఘనంగా స్వాగతం పలికారు. పీఠాధిపతులు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్నికి విశేష పూజలు చేసి మంగళహారతి ఇచ్చి , వసంత్సోతవం నిర్వహించారు.  అనంతరం   మహా రథోత్సవంలో  ఉత్సవ మూర్తి శ్రీ ప్రహ్లాద రాయలను ఆశీనులను చేసి మఠం ఆవరణంలో అశేష భక్తులు, గ్రామ ప్రజల మధ్య ఘనంగా ఊరేగించారు. కార్యక్రమంలో మఠం అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author