మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
1 min read

ఎందరో త్యాగమూర్తులు త్యాగపలమే నేడు సిద్ధించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఏలూరు ఎంపీపీ పెన్మచ్చ శ్రీనివాసరాజు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్నేడు :స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ పెన్మచ్చ శ్రీనివాసరాజు ముందుగా మహ్మాతాగాంధీజీ, సుభాష్ చంద్రబోసు, భగత్‌సింగ్, భాల గంగాథర్ తిలక్, చిత్రపటాలకు పూలమాలల వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల, త్యాగా పోరాటాల వల్ల మనకు స్వాతంత్య్రం లభించిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారిణి వి. శ్రీలత, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథకం కార్యాలయ సిబ్బంది మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు.

