ఎందరో స్వాతంత్ర యోధుల త్యాగఫలమే మనకు స్వాతంత్రం
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: మరి ఎందరో స్వతంత్ర యోధుల త్యాగఫలమే మనకు ఈనాడు స్వతంత్రము వచ్చిందని, మనం స్వేచ్ఛగా ఉన్నామంటే స్వతంత్ర యోధుల త్యాగఫలమే నని నిత్యం మనం వారిని స్మరించుకోవాలని ప్యాపిలి సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఎమ్మార్వో భారతి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా చేపట్టారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై మధుసూదన్ మువ్వల జెండాను ఆవిష్కరించారు. అలాగే తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ భారతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మహిళా సమైక్య కార్యాలయంలో ఎపీఎం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మహిళా మండలి సమైక్య అధ్యక్షురాలు గొల్ల సరోజ, మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచి లక్ష్మీదేవి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా నాయకులు రాజా నారాయణ మూర్తి, శ్రీనివాసులు, ఖాజా పీర్ అలాగే మండల పరిధిలోని వెంకటం పల్లి పాఠశాలలో ఉపాధ్యాయడు శేషయ్య అధ్వర్యంలో గ్రామ సర్పంచి సుబ్బారెడ్డి, మండలంలోని అన్ని పాఠశాలలో సచివాలయ కార్యాలయంలో ఆ సంబంధించిన అధికారులు 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.


