NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేఎల్ఎస్సార్ కంపెనీ..కాంట్రాక్టర్లకు బెదిరింపులు

1 min read

పనులు చేసిన డబ్బులు ఇవ్వటం లేదు

మాకు ఆత్మహత్యలే శరణ్యమని కాంట్రాక్టర్ల ఆవేదన..

పనులను అడ్డుకున్న కాంట్రాక్టర్లు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  మేం చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా నెల్లూరు కేఎల్ఎస్ఆర్ కంపెనీ వారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి నుంచి ఓర్వకల్లుకు స్టీల్ ప్లాంట్, విమానాశ్రయం,స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీకి నీటి పైప్ లైన్ పనులను కాంట్రాక్టర్లు బాల వెంకటేశ్వర్లు,రామకృష్ణ నందికొట్కూరు పట్టణంలో కోట హైస్కూల్ దగ్గర అడ్డుకున్నారు.ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కంపెనీ వారు ఒప్పందం ప్రకారం 2 కి.మీ మేరకు జెసీబీ హిటాచీలతో వర్క్ చేసినామని అయితే చేసిన వాటికి బిల్లులు దాదాపుగా 30 లక్షల రూపాయలు ఇవ్వకుండా సంబంధిత కంపెనీవారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పలుమార్లు హైదరాబాద్ ఉన్న కంపెనీ దగ్గరకు 12సార్లు వెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.ప్రశ్నిస్తే తమ దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో మమ్మల్ని బయటకు తోసేశారని అన్నారు.దీంతో మాకు రావాల్సిన డబ్బులను ఇవ్వకుండా మోసం చేశారని స్థానిక కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ యొక్క పనులను 2021 సంవత్సరంలో 2.1 వర్కు చేయడం జరిగిందని అన్నారు. నానా ఇబ్బందులు పెట్టి కింద స్థాయి కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి మాకు ఏర్పడిందని అన్నారు. సమయానికి పనులు జరగాలని ఆలోచనతో వేరేచోట అప్పు తెచ్చి పనులు చేశామని ఇప్పుడు ఆ అప్పు వారు డబ్బు ఇవ్వమని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కావునా ఇప్పటికైనా కంపెనీ యజమానం స్పందించి మాకు రావాల్సిన అమౌంట్ వచ్చే విధంగా సహాయం చేయాలని అన్నారు.లేనిపక్షంలో కేఎల్ ఎస్సార్ కంపెనీవారు డబ్బులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని స్థానిక కాంట్రాక్టర్ల ఆవేదన వ్యక్తం చేశార కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

About Author