NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత మెగా ఆర్థో వైద్య శిబిరం విజయవంతం..

1 min read

50 మందికి పైగా వైద్య పరీక్షలు చేసిన డా. రవితేజ  రెడ్డి

  • ఘనంగా శిరీష పాలి క్లినిక్​ 3వ వార్షికోత్సవం

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు నగరం ఎన్​. ఆర్​ పేట లోని శిరీష పాలి క్లినిక్​  మూడవ వార్షికోత్సవం సందర్భంగా    శనివారం ఉచిత మెగా ఆర్థో వైద్య శిబిరం నిర్వహించినట్లు  ఎముకలు, నరములు, వెన్నెముక మరియు కీళ్ల మార్పిడి శస్ర్త చికిత్స  వైద్య నిపుణులు డా. ఎస్​. రవి తేజ రెడ్డి తెలిపారు.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో దాదాపు 50 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్య శిబిరంలో భాగంగా పి.ఆర్​.పి. థెరపి, రేడియో ఫ్రీక్వెన్సి అబ్లెషన్​ థెరపి, మోకాళ్ల కీళ్ల మార్పిడి( ఫాస్ట్​ ట్రాక్​ పద్దతి )  ఆర్ర్థో స్కోపి,  ఫ్రాక్చర్​ మేనేజ్​ మెంట్​,  తుంటి కీళ్ల మార్పిడి తదితరవి  వైద్య పరీక్షలు చేసి, అవసరమైన  పేద వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్థో పెడిక్​ వైద్య నిపుణులు డా. ఎస్​. రవి తేజ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలోనే మొదటి సారిగా  ఇంటర్వెన్షనల్​ ఆర్థో పెడిక్​ వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. శిరీష పాలి క్లినిక్​ స్థాపించి మూడేళ్లవుతుందని, ప్రతి ఏడాది మాదిరిగానే  ఈ ఏడాది కూడా ఉచిత మెగా ఆర్థో వైద్య శిబిరం నిర్వహించామని, ఇందులో రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, రాయచూరు, మహబూబ్​ నగర్​ , గద్వాల జిల్లాల నుంచి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు.  అంతేకాక  ఎముకల సాంద్రత పరీక్ష ( బిఎండి), ఫుట్​ సెన్సిటివిటి పరీక్ష ఉచితంగా చేసినట్లు వెల్లడించారు. సాయంత్రం శిరీష పాలి క్లినిక్  మూడో వార్షికోత్సవం సందర్భంగా కేక్​ కట్​ చేసి సిబ్బందికి, రోగులకు పంచారు.

About Author