విద్యార్థులకు నగదు అందజేత…
1 min read

హొళగుంద న్యూస్ నేడు: తన తండ్రి విద్యాభ్యాసం చేసిన పాఠశాల విద్యార్థులకు అన్ని విధాలుగాఆదుకునేందుకు మిక్కిలినేని దీప్తి కంకణం కట్టుకున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నందు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యా ర్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం విద్యార్థులకు నగదును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మిక్కిలినేని దీప్తి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పాఠశాల ఉపాధ్యాయులకు, కన్న తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి పై ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు పోటీ తత్వంలో పాల్గొని ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులను కోరారు. పాఠశాల అభివృద్ధికై నా తండ్రి మిక్కిలినేని వెంకట శివప్రసాద్ ఆధ్వర్యంలో నా వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే ప్రతి ఏడాది పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి అందిస్తామని ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు నందీష్కు 50వేలు నగదు, ప్రవళిక 30, వేలు, రంజిత్కు 20,వేలు రూపాయల నగదు బహుమతిని చెక్కుల రూపంలో వారి తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహకాలతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మిక్కిలినేని దీప్తి, మిక్కిలినేని వెంకట శివప్రసాద్లను విద్యార్థులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ఉపాధ్యాయ బృందం ఘనంగాసన్మానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


