30 వేల ఆర్థిక సహాయం … యూటీఎఫ్ ప్యాపిలి మండల శాఖ
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: గతంలో ప్యాపలి మండలంలోని సీతమ్మ తండా ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయునిగా పనిచేసిన రవి కుమార్ సిపిపిడి అనే ఊపిరితిత్తుల వ్యాధి ద్వారా బాధపడుతూ ఇప్పటికే 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఊపిరితిత్తుల మార్పిడి చేస్తేనే ఫలితం ఉంటుందని వైద్యులు చెప్పినట్లు వాటికి సుమారు 35 లక్షల రూపాయలు ఖర్చు కేవలం చికిత్సకు అవుతుందని ఆ తర్వాత ఇంకా 10 లక్షల పైన ఖర్చు వస్తుందని తెలియచేసినట్లు రవి భార్య సుగుణ తెలియచేశారు.అంతేకాక ప్రతిరోజూ 24 గంటలు ఆక్సిజన్ సహాయంతోనే ఊపిరి తీసుకుంటున్నట్లు తెలిపారు, ఇందుకై రోజు 1000 రూపాయలు అనగా ప్రతి నెల 30 వేలు ఖర్చు అవుతున్నట్లు తెలియచేశారు.ఈ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్యాపలి మండల యూటీఎఫ్ నాయకులు మండలంలోని ఉపాధ్యాయుల ద్వారా డబ్బును ప్రోగు చేసి 30 వేల రూపాయలను ,ఫోన్ పే ద్వారా దాదాపు 20 వేలు.మొత్తంగా 50 వేలు ఈరోజు ఉదయం నంద్యాల లో ఉంటున్న రవి ఇంటికి వెళ్ళి భార్యాభర్తల చేతికి యూటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ప్రసాద్ చేతుల మీదుగా యూటీఎఫ్ ప్యాపలి మండల అధ్యక్షులు రమేష్ నాయుడు,యూటీఎఫ్ నాయకులు అబ్దుల్ లతీఫ్, మదన్ గోపాల్,వెంకటేశ్వర రావు మరియు నంద్యాల జిల్లా సోషియల్ మీడియా కన్వీనర్ అరవింద కుమార్ అందజేశారు.ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మానవతా దృక్పథం తో సహాయం చేసి సార్ కి జీవితాన్ని ప్రసాదించగలరని యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ తరఫున అర్థిస్తున్నామని వారుతెలిపారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

