ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సర్వ సభ్య సమావేశం
1 min read

కర్నూలు , న్యూస్ నేడు: రేపు 19 -08-25 మంగళవారం ఉదయం 10 గంటలకు కర్నూలు నగరం లో పెద్ద మార్కెట్ వద్ద కల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కల్యాణ మంటపం నందు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సర్వ సభ్య సమావేశం జరుగుతుంది అని సమాఖ్య ప్రధాన కార్యదర్శి హెచ్ కె మనోహర రావు తెలిపారు. ఈ సమావేశం లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల కొరకు రాష్ట్రం లో వివిధ ప్రాంతం లలో జాబ్ మేళా నిర్వహించడం గురించి, పెళ్లి కాని యువత కొరకు వివాహ పరిచయ వేదిక లు నిర్వహించడం ప్రభుత్వం ద్వార విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఉపాధి శిక్షణ కొరకు ప్రత్యేక ఏర్పాటు గురించి ముఖ్యం గా చర్చించడం జరుగుతుంది.శ్రావణ మాసం చివరి మంగళవారం పురస్కరించుకొని ఉదయం 8గంటలకు మహిళల చే సామూహిక గౌరీ వ్రతం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నకు రాష్ట్రం లో నలు మూలాల నుంచి బ్రాహ్మణ నాయకులు హాజరు అగుచున్నారు కావున కర్నూలు నగరం లో బ్రాహ్మణ కుటుంభ సభ్యులు హాజరు అయి సభను జయప్రదం చేయవలెను అని కోరినారు.ఈకార్యక్రమం లో నాయకులు ఇస్కాల సురేష్ కుమార్,కల్లె చంద్రశేఖర్ శర్మ,హెచ్ కె రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

