NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాంటిస్సోరిలో కరుణ క్లబ్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక కరుణ క్లబ్ కర్నూల్ కేంద్ర వారి ఆధ్వర్యంలో టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం మాంటిస్సోరి ఏ-క్యాంప్ నందు నిర్వహించబడినది. ఇందులో డాక్టర్ భవాని శంకర్ రెడ్డి , అసిస్టెంట్ డైరెక్టర్, అనిమల్ హస్బడ్రీ, కర్నూల్ వారు తమ సందేశాన్ని అందించారు ఆయన ప్రతి ఒక్క మనిషికి కరుణ ఉండాలని ప్రతి జీవిని సంరక్షించాలని కోరారు. తర్వాత శ్రీమతి పార్వతి    , హెచ్​ఓడి , సిల్వర్ జూబ్లీ కాలేజ్, కర్నూల్వారు మాట్లాడుతూ కరుణ, అహింస, సాత్వికత ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమై ఉండాలని టీచర్స్ని వారి మాటలతో ప్రభావితం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ మణిలాల్ జైన్, ఎక్స్​-చైర్మన్, కర్నూల్ కేంద్ర మరియు శ్రీ నాగరాజు , ఎక్స్​-ప్రెసిడెంట్, కర్నూలు కేంద్ర అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి అరవింద్ బండారి, చైర్మన్, జితేంద్ర మెహతా, ప్రెసిడెంట్ మరియు రవీంద్ర జైన్ సెక్రెటరీ  పాల్గొన్నారు. తమ సహకారాన్ని అందించిన మాంటిస్సోరి స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి రమా జ్యోతి కి కృతజ్ఞతాభివందనలు తెలిపారు.

About Author