మున్సిపల్ ఎక్స్–అఫీషియో సభ్యుడి ప్రమాణస్వీకారంలో వీరభద్రగౌడ్
1 min read

ఆలూరు న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు అత్యంత సన్నిహితులు ఎమ్మెల్సీ బి.టి. నాయుడుని ముఖ్యమంత్రి వర్యులు (మన కూటమి ప్రభుత్వం) ఆదోని మున్సిపల్ ఎక్స్–అఫీషియో సభ్యునిగా నియమించి నందువలన ..ఆదోని మున్సిపల్ ఆఫీసులో జరిగిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికిఆలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి బి. వీరభద్ర గౌడ్ హాజరై బిటి నాయడు ను ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ,ఆదోని మాజీ ఎమ్మెల్యే, ఆదోని తెలుగుదేశం పార్టీ ఆపద్బాంధవుడు .కొంకా మీనాక్షినాయుడు ,జిల్లా ఇతర ముఖ్యనాయకులు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. అలాగే ఈకార్యక్రమానికి ఆలూరు తాలూకా వివిధ మండలాల ఆయా గ్రామాల టిడిపి కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ లు, ఎంపీటిసి లు డిసి, చైర్మన్లు, డబ్ల్యుయుఏ ప్రెసిడెంట్లు క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగుయువత, ఐటిడిపి,టిఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, సిబిఎన్ ఆర్మీ, టిడిపి, సోషల్ మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


