అధిక వర్షాలు వలన నష్టపోయిన రైతంగాన్ని ఆదుకోవాలి
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన మండలంలో పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్ డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం నాడు తెర్నేకల్, పాలకుర్తి రెవెన్యూ పరిధిలోని గ్రామాలను సిపిఎం జిల్లా నాయకులు బి.వీర శేఖర్, మండల కమిటీ సభ్యులు అశోక్ భాషా ,మహబూబ్ బాషా ,పాండురంగడు, తెర్నేకల్ నాయకులు వీ.టి. దొడ్డప్ప తో కూడిన సిపిఎం బృందం అధిక వర్షాల వలన పంట నష్టం పరిశీలన చేసింది. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడుతూ, మండలంలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పొలాల్లో నీరు నిలిచి పంటలకు తీవ్రంగా నష్టం కలుగుతుందని, అదేవిధంగ పంట పంట భూములు జోములకెత్తి కుళ్లి పోయే పరిస్థితి ఉందని అన్నారు. రెవెన్యూ,వ్యవసాయ శాఖ లు పంటలు పరిశీలన చేసి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట దిగుబడి రాక కోసం ఎదురుచూస్తున్న రైతుకు అధిక వర్షాల వలన తీవ్రమైన పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టం జరిగిన రైతుకు ప్రభుత్వం ఎకరాకు 50 వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. .అదేవిధంగా పంటల బీమా మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో పెంచడం ద్వారా రైతులు పంటల బీమా చేసుకోలేకపోయారని కావున ప్రభుత్వం ఉచిత పంటల రైతులకు వర్తింపజేయాలని వార కోరారు. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారికి సిపిఎం బృందం వినతిపత్రం అందజేసింది.. ఈ కార్యక్రమంలో రైతులు రంజాన్, నబిసాబ్, మాదన్న ,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


