NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణ తోపాటు కులగణన కూడా చేపట్టాలి

1 min read

బసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్

జిల్లా అధ్యక్షుడుగా అర్నేపల్లి తిరుపతిరావు ఎన్నిక

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ ​నేడు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణ తోపాటు కులగణనను కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు డిమాండ్ చేశారు. స్థానిక పవర్ పేట లోని కొప్పు వెలమ కళ్యాణమండపం నందు సోమవారం బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా అర్నేపల్లి తిరుపతిరావు ఎన్నికకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శంకర్రావు మాట్లాడుతూ  బిసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 33% శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. అలాగే బీసీలకు 33% శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని ఆ ప్రకారం అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బీసీల కోసం కూటమి ప్రభుత్వం మంచి ఫలితాలను అందిస్తుందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందన్నారు.నూతనంగా ఎన్నికైన సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా తిరుపతిరావు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి  చేస్తానని తనును నమ్మి తన పైన పెట్టిన బాధ్యతను తూచా తప్పకుండా నా సంఘ సభ్యులతో నిర్వహిస్తానని సంతోషంగా తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే బడేటి చంటి ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో బీసీ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన తిరుపతిరావుకి నగరంలోని పలువురు బీసీ నాయకులు, అభిమానులు కూటమి శ్రేణులు,పూల బొకేలు  అందించి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు మారగాని చంద్ర కిరణ్,మాజీ జిల్లా అధ్యక్షుడు భీమవరపు పాపారావు,ఉక్కుసూరి గోపాలకృష్ణ,డా:లంకా వెంకటేశ్వరరావు(ఎల్.వి.ఆర్) బౌరోతు బాలాజీ,పలువురు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీ నాయకులు,పాల్గొని విజయవంతం చేశారు.

About Author