ట్రంపు.. మోడీ దిష్టిబొమ్మ దహనం..ధర్నా
1 min read

అమెరికా అధ్యక్షులు వ్యవసాయ ఉత్పత్తులపై విధించిన 50% సుంకాలను ఎత్తేయాలి
కార్పొరేట్ సంస్థల నుండి వ్యవసాయాన్ని రక్షించాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య …..డిమాండ్
పత్తికొండ , న్యూస్ నేడు : వ్యవసాయంలోకి కార్పొరేట్ కంపెనీలను రానీయొద్దని, ట్రంప్ విధించిన 50% సుంకాలు వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉచిత వాణిజ్య ఒప్పందాలను విరమించాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ పత్తికొండలో సోమవారం చదువుల రామయ్య భవనం నుండి నాలుగు స్తంభాల వరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ ఊరేగింపు నాలుగు స్తంభాల దగ్గర నిరసన తెలిపారు. అనంతరం ట్రంపు మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి ఈ ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బి సురేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య మాట్లాడుతూ, భారత ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశాలతో చేసుకున్న అన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను పార్లమెంటులో చర్చించాలని కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశీయ రైతాంగ ప్రయోజనాలకు నష్టం చేసే అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నదనే నేపంతో భారత దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై 50% సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిడం దుర్మార్గమన్నారు. ట్రంప్, మోడీ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం కారన్న వై.ఎన్. వెంకట రాముడు సిపిఐ పత్తికొండ మద్దికేర మండల కార్యదర్శి లు యు కారు మంచి నాగరాజు పట్ తదితరులు పాల్గొన్నారు.


