విజిలెన్స్ ఎండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు
1 min read

వాణిజ్య అవసరాలకు సబ్సిడీ సిలిండర్లు వాడకం
నిత్యవసర చట్టం1955 ప్రకారం కేసు నమోదు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రీజినల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి పి.మహేష్ ఏలూరు వారికి వాణిజ్య అవసరాలకు సబ్సిడి గ్యాస్ సిలిండర్లు వాడుచున్నట్లుగా వచ్చిన విశ్వసనీయ సమాచారo ప్రకారం వారి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఏలూరు పట్టణం లో మేస్సేర్స్ రవి కుమార్ టీ సెంటర్ నందు తనికీ చేయగా 4 గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడి గ్యాస్) సిలిండర్లు గుర్తించి హోటల్ యజమాని అయిన మిడతాని రవికుమార్ ను ప్రశ్ని౦చగా అతను వ్యాపార నిమిత్తం వాణిజ్య గ్యాస్ సిలిండర్లు బదులుగా గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడి గ్యాస్) సిలిండర్లు వాడుచున్నట్లు తెలియచేసారు. ఈ తనికీలో రు.10,310/-లు విలువ కలిగిన 4 గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడి గ్యాస్) సిలిండర్లు సీజ్ చేసి టీ సెంటర్ యజమాని అయిన మిడతాని రవికుమార్ పై నిత్యవసరవస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేయడమైనది. ఈ తనికీ నందు విజిలెన్సు ఎస్ ఐ కె. నాగరాజు, విజిలెన్సు తహసిల్దార్ బి. కన్యాకుమారి, ఏలూరు ఎస్ డి టి కె. రమేష్ కుమార్ మరియు పట్టణ రెవిన్యూ అధికారులు పాల్గొనడం జరిగినది.

