ఘనంగా విజేత విందు భోజనం రెస్టారెంట్ ప్రారంభం
1 min read

విచ్చేసిన ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు
అందరికీ అందుబాటులో, ఆహ్లాదకరమైన వాతావరణంలో
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ యార్లగడ్డ వారి వీధిలో నూతనంగా నెలకొల్పిన విజేత విందు భోజనంరెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ముఖ్యఅతిథిగ హాజరై గార్డెన్ రెస్టారెంట్ ను ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభత్సవ మహోత్సవానికి నగరంలోని వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని రెస్టారెంట్ అధినేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులకు రుచికి,రుచికి,శుభ్రతకు అన్ని రకాల వంటకాలు భోజన ప్రియులకు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. సువిసాలమైన. ఆహ్లాదకరమైన ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. విందులకు, వినోదాలకు ఆర్డర్లకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని తద్వారా సకాలంలో అందిస్తామని తెలిపారు. ఒక్కసారి మా రెస్టారెంట్ కి విచ్చేసి మా రుచులను ఆస్వాదించి మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కస్టమర్ దేవుళ్లను ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు డి.ఎస్.పి. శ్రావణ్ కుమార్ స్థానిక కార్పొరేటర్ జీవి ప్రసాద్, పాము శామ్యూల్, సబ్బన శ్రీనివాసరావు విచ్చేసి వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.



