NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిరాక్స్ పేపర్లతో బీఈడీ కళాశాలలకు అనుమతులు ఇవ్వడం తగదు

1 min read

ఆర్ పి ఎస్ ఎఫ్  జిల్లా అధ్యక్షుడు నాగరాజ్

కర్నూలు, న్యూస్​ నేడు:   రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీఈడీ కళాశాలలతో యూనివర్సిటీ అధికారులు కలిసి లోపాయి కారి ఒప్పందం చేసుకొని అనుమతులు ఇవ్వడం సరైనది కాదని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య బసవ రావు గారికి ఆర్పి ఎస్ ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బీఈడీ కళాశాలలో కేవలం జిరాక్స్ పేపర్లు చూసి అనుమతులు అడగడం దీనికి యూనివర్సిటీ అధికారులు సైతం తూతూ మంత్రంగా వెరిఫికేషన్ చేసినట్టు చేసి అనుమతులు ఇవ్వడం సరైంది కాదని అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని కొన్ని కళాశాలలకు బిల్డింగులు కూడా లేకుండా కేవలం అఫ్లేషన్ కు మాత్రమే బిల్డింగులు చూపి ఆ తరువాత ఏదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆఫీస్ లాంటిది తీసుకొని అక్కడే అడ్మిషన్ ప్రక్రియ మొదలుపెట్టి ఆ సంవత్సర మొత్తం పూర్తి చేస్తున్నారని అదేవిధంగా కొన్ని కళాశాలలకు అర్హత గల ప్రిన్సిపాల్ సైతం లేరని మరియు తరగతులు కూడా నిర్వహించడం లేదని సరైన సిబ్బంది లేక కొంతమందితో సర్టిఫికెట్లు పెట్టించుకుని వారికి అడపదడప నామ మాత్రంగా కొంత డబ్బు చెల్లించి వారి సర్టిఫికెట్లు వాడుకొని అనుమతుల పొంది సొమ్ము చేసుకుంటున్నారు . అని అంటే యూనివర్సిటీ అధికారుల అండదండలు మాకు ఉన్నాయని మీకు ఏమి కాకుండా మేము చూసుకుంటామని పాఠశాలల ఉపాధ్యాయులను సైతం ప్రలోభ పెడుతున్నారని దీనిపై సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే దీనిలో యూనివర్సిటీ అధికారుల హస్తం ఉందో వారిపై చర్యలు తీసుకొని అదేవిధంగా నిబంధనలు పాటించని కళాశాలలకు ఆ అనుమతులు ఇవ్వద్దని  యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య బసవ రావు గారిని కోరడం జరిగిందని దీనికి ఆయన స్పందిస్తూ అలాంటి ఏ కళాశాలలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని తెలిపారని అదేవిధంగా సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోకపోతే ఆధారాలతో పాటు విద్యా శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆర్పిఎస్ఎఫ్ యూనివర్సిటీ నాయకులు బాలాజీ,సాయి, వీరేంద్ర,బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author