NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర మంత్రులతో ఏపీ ఐటి, విద్యాశాఖ మంత్రి భేటీ

1 min read

పాల్గొన్న  కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 

‎పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఢిల్లీ పర్యటనకు వచ్చిన యువనేత, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం ఎంపీలతో నారా లోకేష్ కొద్దిసేపు సమావేశం అయ్యారు. రాష్ట్ర, పార్లమెంట్ నియోజకవర్గాల సమస్యల గురించి చర్చించడం జరిగింది. అనంతరం రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్,జేపీ నడ్డా,నితిన్ గడ్కరీల,అశ్విని వైష్ణవ్, జైశంకర్,హర్దీప్ సింగ్ పూరి, లను కలిసి చర్చలు జరిపారు.కేంద్ర మంత్రులతో జరిగిన పలు భేటీలలో మంత్రి నారా లోకేష్ తో పాటు  కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్ సహచర ఎంపీలు,పాల్గొన్నారు. కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లను కలిసిన సందర్భంలో నూజివీడు రింగ్ రోడ్డు, ఆర్వోబీలు సహా ఏలూరు పార్లమెంటు పరిధిలోని పలు ప్రాజెక్టులపై ఇటీవల తాను వినతి పత్రాలు ఇచ్చిన విషయాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రులకు గుర్తుచేసారు.

About Author