పార్కు, సువిధ కాంప్లెక్స్ లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : సోమవారం కలెక్టర్ కార్యాలయ సముదాయ ప్రాంగణం లో నవీకరించిన జాతీయ చిహ్నం సర్కిల్, ఫౌంటెన్ తో కూడిన పార్క్, నూతనంగా నిర్మించిన సువిధ శానిటరీ కాంప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ . కలెక్టరేట్ సుందరీకరణ లో భాగంగా ముఖ భాగంలో జాతీయ చిహ్నం సర్కిల్, ఫౌంటెన్ తో కూడిన పార్కు లను నవీకరించడం జరిగిందన్నారు..పార్కు పచ్చదనంతో, ఆహ్లాదంగా ఉండేలా రక రకాల అలంకరణ మొక్కలను నాటామని కలెక్టర్ తెలిపారు..అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు వచ్చే ప్రజల కోసం, కలెక్టరేట్ లోని కార్యాలయాలకు వచ్చే ప్రజల కోసం సువిధ కాంప్లెక్స్ ను నిర్మించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ సుందరంగా, పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, పంచాయతీ రాజ్ ఎస్ ఈ మద్దన్న,డిపివో భాస్కర్, ఏవో శివరాముడు , సువిధ శానిటేషన్ సంస్థ అధిపతి సంజయ్ కుమార్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

