శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శ్రీ పి. చిన్న శంకరప్ప, కర్నూలు వారు సోమవారం ఈ దేవస్థాన శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం రూ. 5,00,116 /-లు మరియు గో సంరక్షణ పథకానికి విరాళం రూ. 5,00,116 /-లను అందజేశారు. ఈ మొత్తానికి సంబంధించిన బ్యాంకు చెక్కులను కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయములో కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

