NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం

1 min read

ఎల్ ఎల్ సి,,, డి సి,, చైర్మన్, మిక్కిలినేని,వెంకట శివప్రసాద్

హొళగుంద ,న్యూస్ నేడు : మండల కేంద్రంలో రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎల్ ఎల్ సి, డిసి చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ అన్నారు, వారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం లో  రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు మిక్కిలినేని వెంకట శివ ప్రసాద్ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ వారి ఆర్థిక ప్రగతికి,చర్యలు,తీసుకుంటుందన్నారు అలాగే కూటమి ప్రభుత్వం చెప్పిన ఆరు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా కూటమి  ప్రభుత్వం అధికారంలో రాగానే వృద్ధులు వితంతువులు సామాజిక పింఛన్లను 3000 నుంచి 4000 రూపాయలకు పెంచారు ఐదు రూపాయలకే భోజనం అందించిన అన్న క్యాంటీన్లను జగన్ ప్రభుత్వంలో మూసివేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మళ్లీ వాటిని ప్రారంభించారు, వైసీపీ ప్రభుత్వంలో వాలంటర్లు ఒకటో తారీకు ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి పింఛన్లను పంపిణీ చేసేవారు, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వాలంటీర్ల వ్యవస్థను పక్కనపెట్టి సచివాల సిబ్బందితో ఒకటవ తారీఖున పింఛన్ల పంపిణీ కొనసాగిస్తుంది, తల్లికి వందనం పథకం స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికీ 15000, వేలు బదులు 13000 వేలు,అందించింది 2000 రూపాయలను విద్య అభివృద్ధి నీది కింద తీసుకుంది, ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయలు రైతుకు అందిస్తామని అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 7000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేసింది, అలాగే రోడ్లు మరమ్మత్తు చేపట్టింది కేంద్ర సహాయంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రహదారులకు 6000 వేల కోట్లతో మరమ్మతులు చేపట్టింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించింది మహిళలు రాష్ట్రమంతటా తిరిగే ప్రయాణ సౌకర్యం కల్పించింది అలాగే ఏడాదికి అక్క చెల్లెమ్మలకు మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది,కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ, తొందర్లోనే, నెరవేస్తుందని అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

About Author