NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 50 వేల పరిహారం ఇవ్వాలి…

1 min read

పంట నష్టాన్ని అంచనా వేయడంలో అధికారుల నిర్లక్ష్యం… సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్

పత్తికొండ, న్యూస్​ నేడు: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరకు 50 వేలు చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు.  పంట నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య  వైఖరి రైతాంగానికి తీవ్ర నష్టదాయకంగా ఉందని ఆయన అన్నారు.బుధవారం నాడు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాల వలన నష్టం జరిగిన పంటల పరిశీలనకు సిపిఎం పార్టీ జిల్లా బృందం పర్యటించింది. ఈ మేరకు దేవనకొండ మండలంలో కరివేముల, పాలకుర్తి ,తెర్నేకల్ రెవిన్యూ పరిధిలోని పంట పొలాలను సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ తో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అధిక వర్షాలు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మీగల్చాయని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .గత సంవత్సరం కూడా ఆగస్టు ,సెప్టెంబర్ మాసంలో కురిసిన అధిక వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ,ఈ సంవత్సరం గత 15 రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలు రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు రైతులు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి తగు సమాచారాన్ని ప్రభుత్వం అందజేయాల్సి ఉండగా మొక్కుబడిగా వ్యవసాయ శాఖ , రెవెన్యూ అధికారులు మోక్కుబడిగా నివేదికల పంపే ప్రయత్నం చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించి పేర్కొన్నారు పత్తి, కంది ,ఆముదం ,వేరుశనగ ఇతర కూరగాయ పంటలు అధిక వర్షాల వలన నీటిలో మునిగి పోయావని, చాలా పంటలు కుళ్ళిపోయాయని కొన్ని పంటలు నీటిలో మునిగి రైతులకు నస్టపరిహారం ఇవ్వాలి.

About Author