బాధిత కుటుంబాలను పరామర్శించిన జై భీమ్ ఎమ్మార్పీఎస్
1 min read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ
ఆలూరు న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో చిగిలి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు భీమేష్, వినయ్, మహబూబ్ బాషా, సాయికిరణ్, కిన్నెరసాయి,శశి కుమార్ లు చనిపోవడం దేశాన్ని కలిచివేయడం జరిగింది.ఈ సంఘటన అన్ని మూల కోణాలు తెలుసుకొని ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ… స్కూలుకు సమీపంలో నీటి కుంటలు ఏర్పడడానికి కారణమైన ఎర్రమట్టి తవ్వకాలు. ఎర్రబట్టి తవ్వకాలకి ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చినటువంటి స్థానిక పంచాయతీ సెక్రెటరీ వీఆర్వో ఎంపీడీవో ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది వారు యొక్క వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపార నిమిత్తం ఇలా మట్టిని ఇష్టానుసారంగా తవ్వి ఆ విధంగా నిర్ధాక్షణంగా వదిలేయడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకి నీరు అధికంగా నిండి ఇంతటి దారుణం జరిగిందని దీనికి బాధ్యులు అయినటువంటి అధికారులపై సమగ్ర విచారణ జరిపి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పురాణావృతం కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలు గాని ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయో వాటికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇటువంటి పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ ని డిమాండ్ చేస్తూ, బాధితులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి 30 లక్షల పరిహారం, దళిత కుటుంబాలకి ఒక్కో కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం 20 లక్షలు ఆర్థిక పరిహారం 5 ఎకరాలు పొలము 5 సెంట్లు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, జిల్లా పరిషత్ హెచ్ఎం తో మాట్లాడి స్కూల్ చుట్టూ కంచవేసి విద్యార్థి ప్రాణాలు ఇక మీదట పోకుండా జాగ్రత్త తీసుకోవాలని మాట్లాడి చనిపోయిన బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించ లేకపోతే జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘము సత్తా చాటుతామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సలహాదారుడు వై ఆంజనేయ జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా కన్వీనర్ మణికుమార్ జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని నియోజకవర్గం ఇన్చార్జి రాజబాబు జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆదోని మండల అధ్యక్షుడు కపిటి రాజేంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ కోశాధికారి మనోహర్ జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆలూరు నియోజకవర్గ నాయకులు నాగరాజు, మారేసు జై భీమ్ ఎమ్మార్పీఎస్ చిగిలి గ్రామ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


