NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యం

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని  డోన్ ఎమ్మెల్యే  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.ఈసందర్భంగా శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు నీటి సరఫరా, రోడ్లు, పింఛన్లు, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు వంటి ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే కి వివరించారు.ఎమ్మెల్యే  ప్రతి వినతిని శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలను తెలియజేయవచ్చని సూచిస్తూ, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిసీసిఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరావు యాదవ్, సీనియర్ తెదేపా నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎద్దుల దోడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ టి.శ్రీనివాసులు, తేదేపా నాయకులు చండ్రుపల్లి లక్ష్మీనారాయణ యాదవ్,గోల్ల రామ్మోహన్ యాదవ్, నాగేంద్ర, బత్తుల రామెశ్వర రెడ్డి,ఆర్.ఇ నాగరాజు,కోమ్మెర్రి వెంకట రాముడు, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, తెదేపా నాయకులు జలదుర్గం శ్రీకాంత్,ఎస్ కె వలి, చల్లా అనుదిప్, చల్లా వీర అంజీనేయులు, కడితం ప్రతాప్ రెడ్డి,సందిప్ మరియు  కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author