NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్  పత్రాన్ని కుటుంబానికి అందజేసిన ఎమ్మెల్యే

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి పట్టణంలో నివసించే కుళ్ళయప్ప రోడ్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం అందింది.  డోన్ శాసనసభ్యులు  కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి   పార్టీ సభ్యత్వంగా తీసుకున్న రూ.100 భీమా పథకం ద్వారా లభించిన రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్  పత్రాన్ని కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ,”ఈ సాయం మీ కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరటనిచ్చి, ధైర్యంగా జీవితం కొనసాగించేందుకు ఉపయుక్తపడుతుంది” అని తెలిపారు. పార్టీ తమ కార్యకర్తల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా భావిస్తుందని పేర్కొంటూ, “తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది” అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ సహాయం టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా అందించబడింది, ఇది పార్టీ కార్యకర్తల భద్రత కోసం తీసుకున్న ఓ మానవీయ చర్య అని ఎమ్మెల్యే  తెలిపారు. ఈకార్యక్రమంలో డిసీసిఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరావు యాదవ్, సీనియర్ తెదేపా నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎద్దుల దోడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ టి.శ్రీనివాసులు, తేదేపా నాయకులు గోల్ల రామ్మోహన్ యాదవ్, నాగేంద్ర, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా ఫీర్, తెదేపా నాయకులు ఎస్ కె వలి, చల్లా అనుదిప్, చల్లా వీర అంజీనేయులు, కడితం ప్రతాప్ రెడ్డి,సందిప్ మరియు  కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author