NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గిరిజిన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి చర్యలు.. కలెక్టర్​

1 min read

గిరిజను ల్లో సాధికారికతో ధ్యేయంగా,సామాజిక ఆర్ధిక  అభివృద్ది లక్ష్యంగా ఆదికర్మయోగి అభియాన్

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : గిరిజిన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గిరిజిన ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని చివరి మైలు వరకు సేవలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. బుధవారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలు తీరును కలెక్టర్ వివరించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇందులో భాగంగా నూజివీడు, చింతలపూడి, చాట్రాయి టి.నర్సాపురం మండలాలకు చెందిన  బ్లాక్ మాస్టర్ ట్రైనర్ లకు గత  మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.  ఏలూరు  జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, టి. నర్సాపురం, నూజివీడు, చాట్రాయి , చింతలపూడి మండలాల్లో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలు అవుతుందన్నారు.  ఈ 9 మండలాలలో  46 గ్రామాలను మరియు 45 మంది  బ్లాక్ మాస్టర్ ట్రైనర్ లను ఎంపిక చేయడం జరిగిందన్నారు.  ఎంపిక చేసిన 45 మంది బ్లాక్ మాస్టర్ ట్రైనర్ లకు రెండు బ్యాచ్ లుగా  విభజించి మొదటి విడత 25 మంది మాస్టర్ ట్రైనర్స్ కు కెఆర్ పురం ఐటిడిఏలో ఆగస్టు 11 నుంచి 13 వరకు శిక్షణ అందించామన్నారు.  అలాగే  2వ బ్యాచ్ 20 మంది  బ్లాక్ మాస్టర్ ట్రైనర్ లకు ఏలూరులో ఆగస్టు 18 నుండి 20వ తేదీ వరకు శిక్షణ అందించామన్నారు.  సేవా, సమర్పణ్, సంకల్పం ద్వారా స్వందనకరమైన పరిపాలన అందించి చిట్టచివరి గిరిజన ప్రాంతానికి సేవలు వ్యాప్తి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో గ్రామస్థాయిలో  ప్రజల  భాగస్వామ్యంతో విజన్  ప్రణాళికను రూపోందించి,  దానిని అమలు పరచడం ద్వారా అభివృద్దిని సాధించవచ్చన్నారు. విలేజ్  విజన్ ప్లాన్ ద్వారా వికసిత్ భారత్ @ 2౦47 లో భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. త్వరలో బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ మండల స్ధాయిలో లైన్ డిపార్ట్ మెంట్స్ కు రెండురోజులపాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామా స్తాయిలో ప్రజల   భాగస్వామ్యంతో  విజన్ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

About Author