శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి కి సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు
1 min read

వివిధ గ్రామాల నుంచి 470 మంది పూజలో పాల్గొన్న భక్తులు
కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా ఈరోజు 5వ శుక్రవారం కావడంతో కొల్లేటికోట శ్రీ పెద్దింట్ల అమ్మవారి దేవస్థానo లో సామూహిక వరలక్ష్మీ వ్రతం పూజలు జరిగినవి వివిధ గ్రామాల నుంచి 470 పైగా భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నని కార్యనిర్వాహణాధికారి మరియు ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటిటి పరమేశ్వర శర్మ మరియు ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పూజా కార్యక్రమాలు జరిపించి భక్తులకుపాలు మరియు తీర్థప్రసాదాలు అందించారు. పూజ అయిన అనంతరం భక్తులు అన్నప్రసాదం స్వీకరించియున్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాసు ప్రకటన ద్వారా తెలిపియున్నారు.


