NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడడమే జనసేవాదళ్ లక్ష్యం

1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్

సిపిఐ 28వ రాష్ట్ర  మహాసభలు జయప్రదం చేయండి

సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో జనసేవాదళ్ శిక్షణ శిబిరం హనుమాన్ నగర్ ఫ్లాట్లలో జరిగినది. ఈ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) రాష్ట్ర 28వ మహాసభల సందర్భంగా ఒంగోలు నగరంలో 23వ తేదీ జరగనున్న ప్రజా ప్రదర్శన బహిరంగ సభల సందర్భంగా ప్రజా ప్రదర్శనలో అగ్రభాగాన రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాతు చేస్తారని, అందులో భాగంగా ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందించారు.పార్టీ మహాసభలతో పాటు సమాజంలో ప్రజల పైన జరిగే దాడులకు వ్యతిరేకంగా, మతోన్మాద శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా,ప్రజలకు రక్షణ కల్పించడానికి,ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు సహాయం అందించడానికి జనసేవాదళ్ కార్యకర్తలు పని చేస్తారని తెలిపారు. అటువంటి మహత్తర ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా  జనసేవాదళ్ సభ్యులు పనిచేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయడానికి ఏలూరు ఏరియా సమితి జనసేవాదళ్ వాలంటీర్స్ కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ చేతుల మీదుగా జిల్లా సమితి అందించిన రెడ్ షర్ట్ వాలంటీర్స్ యూనిఫామ్ ను శిబిరంలో పాల్గొన్న వారికి అందించారు. ఈ శిక్షణా శిబిరంలో ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కూరెళ్ళ నాగ దుర్గా వరప్రసాద్ మెకానికల్ యూనియన్ కోశాధికారి, ఎఐటియుసి నగర నాయకులు కాటూరి శ్రీధర్, ఏరియా కార్యవర్గ సభ్యులు గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, 16వ డివిజన సభ్యులు ఉప్పులూరి కేశవ రావు, ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ యూనియన్ అధ్యక్షులు తమ్మిశెట్టి రమణయ్య, కొండేటి రాంబాబు గొర్లి పూజిత్ సాయి ఉప్పులూరి లక్ష్మి, భవాని,జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author